Mood of the Nation poll: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 33-35 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీయే ఓట్ల శాతం 47 నుంచి 52 శాతానికి పెరుగుతుందని అంచనా. బీహార్‌లో ఎన్డీయే తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది.
Read Also: Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)-కాంగ్రెస్‌ల ‘‘మహాఘటబంధన్’’ కేవలం 5-7 లోక్‌సభ స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. తాజా పోల్ ప్రకారం, ఎన్డీయే ఓట్ల శాతంలో 5 శాతం గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన 47 శాతంతో పోలిస్తే 52 శాతానికి పెరిగిందని పోల్ వెల్లడించింది. ఇండియా కూటమి ఓట్ల శాతం 2024లో 39 శాతం నుంచి 42 శాతానికి స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఈ సర్వేని జనవరి 2- ఫిబ్రవరి 9 ,2025 మధ్య చేశారు. అన్ని లోక్‌సభ స్థానాల్లో 1,25,123 మంది వ్యక్తుల అభిప్రాయలను తెలుసుకున్నారు.
అయితే, ఈ ఫలితాలు రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీవోటర్ వ్యవస్థాపకుడు-డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ రాష్ట్రంలో ఓట్ల లెక్కల్ని హైలెట్ చేశారు. ఎన్డీయే కలిసి ఉంటే, రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తుందని నుంచి, పదవి నుంచి తొలగించడం ఆర్జేడీ కూటమికి కష్టమని స్పష్టం చేశారు. బీహార్‌లో బీజేపీ, నితీష్ కుమార్ జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఐక్యంగా ఉంటే, ఇండియా కూటమి గెలవడం కష్టమని చెప్పారు.