Site icon NTV Telugu

Monsoon In India: ఒకేసారి ఢిల్లీ, ముంబయిలను తాకిన నైరుతి రుతుపవనాలు..

Monsoon

Monsoon

Monsoon In India: దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. రుతుపవనాల రాకతో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ రెండు నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు ఢిల్లీని.. రెండు వారాల ఆలస్యంగా ముంబయిను నైరుతి రుతుపవనాలు తాక్కినట్టు భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం వెల్లడించింది. ఆరు దశాబ్దాల క్రితంత ఇలా జరిగిందని గుర్తు చేసిన అధికారులు.. చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలుప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది.

Read also:Group War in TDP: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. బస్సు యాత్ర వాయిదా

‘నైరుతి రుతుపవనాలు ముంబయి సహా మహారాష్ట్ర మొత్తం విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత ముందుకు కదలి మిగతా ప్రాంతాలకు చేరుకుంటాయని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుంచి వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ.. గురుగ్రామ్‌లోని వివిధ ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది. గత 24 గంటల్లో ముంబయి దాని చుట్టపక్కల ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అంధేరీ, మలద్, దాషిర్‌లు ముంపు బారినపడ్డాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబయి, థానే, సింధుదుర్గ్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Read also:Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్

ముంబయి, మధ్య మహారాష్ట్ర సహా మహారాష్ట్ర తీరప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బంగాళాఖాతం మరియు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని సినోప్టిక్ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ముంబై, మధ్య మహారాష్ట్రల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో వాయుగుండం మరియు మహారాష్ట్ర మీదుగా కోస్తా కర్ణాటక వరకు వ్యాపించిన చురుకైన ద్రోణి వంటి సినోప్టిక్ పరిస్థితులు కొంకణ్‌తో సహా వచ్చే 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారి తెలిపారు.

Exit mobile version