Site icon NTV Telugu

Weather Updates : రాగల 24 గంటల్లో భారత్‌లోకి రుతుపవనాల ఆగమనం..

Monsoon

Monsoon

వేసవికాలం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావారణ శాఖ. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురియడంతో.. నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

అంతేకాకుండా.. భారీ వర్షాలకు పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడించి.. రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా వర్షాలు కురియడంతో.. మామాడికాయలు నేల రాలాయి. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకువచ్చిన వరిధాన్యం రాశులు కూడా వర్షం నీటికి తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version