NTV Telugu Site icon

Monsoon: మే 31న కేరళను తాకనున్న రుతుపవనాలు..

Monsoon

Monsoon

Monsoon: భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని ఐఎండీ బుధవారం చెప్పింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ, జూలై 15 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు ఆవరిస్తాయి. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలో అంచనా వేసింది.

Read Also: INDIA Bloc: ఇండియా కూటమికి మద్దతుపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..

ఐఎండీ ప్రస్తుత అంచనా ప్రకారం మే 31 నాటికి రుతుపవనాలు కేరళకు రానున్నాయి. గత 19 ఏళ్లలో ఒక్క 2015 తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కేరళకు రుతుపవనాలు వచ్చే తేదీలకు సంబంధించిన కార్యాచరణ అంచనాలు రుజువయ్యాయి. ఇప్పటికే రుతుపవనాలు మే 19న అండమాన్ నికోబార్ తీరాన్ని తాకనున్నట్లు ఐఎండీ చెప్పింది.

గతేడాది కేరళలో రుతుపవనాల ప్రారంభం జూన్ 8న ఒక వారం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈసారి ఇండియన్ ఓషియన్ డైపోర్(IOD) లేదా పశ్చిమంతో పోలిస్తే తూర్పున సాధారణ హిందూ మహాసముద్రం కంటే చల్లగా ఉంటుంది, ఇది మళ్లీ దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు వర్షం కురిపించడంలో సహాయపడుతుంది. IOD ప్రస్తుతం ‘తటస్థంగా’ ఉంది మరియు ఆగస్టు నాటికి సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.