Site icon NTV Telugu

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే..

Monkeypox

Monkeypox

Monkeypox cases in india: దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల నైజీరియన్ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో.. పరీక్షించగా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 8 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 13 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం బాధిత మహిళకు లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read Also: Errabelli Dayakar Rao: బీజేపీది దొంగ ప్రభుత్వం.. అదొక చెత్త పార్టీ

అనుమానిత లక్షణాలు ఉండటంతో నైజీరియన్ మహిళ సెప్టెంబర్ 14న ఆస్పత్రిలో అడ్మిట్ అయిందని.. ఆ తరువాత పరీక్షించగా మంకీపాక్స్ సోకినట్లు తేలింది. ఢిల్లీలో మొత్తం 8 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ఆరుగురు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొదటి ఐదు కేసుల్లో బాధితులకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయన.. అడపాదడపా జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలో జూలై 24న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది.

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదు అయింది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వైరస్ ను గుర్తించారు. ఆ తరువాత మరికొన్ని కేసులు కేరళలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మంకీపాక్స్ వల్ల దేశంలో ఒకరు మరణించారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పాటు యూఎస్ఏలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే 80 శాతానికి పైగా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల్లో 60,799 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి.

Exit mobile version