Site icon NTV Telugu

West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..

Bengal

Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్‌లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు.

7వ తరగతి చదువుతున్న కృష్ణేందు దాస్ అనే 12 ఏళ్ల బాలుడు చిప్స్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్లాడు. అయితే, దుకాణం యజమాని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తిని పదే పదే పిలిచినప్పటికీ స్పందించలేదు. పిల్లవాడు ‘‘అంకుల్ నేను చిప్స్ కొంటాను’’ అని పదే పదే చెప్పినా లోపల ఉన్న యజమాని నుంచి స్పందన రాలేదు. ఎవరూ లేరని, తర్వాత డబ్బులు ఇద్దామనే ఉద్దేశ్యంతో బాలుడు షాప్ ఎంట్రీ వద్ద ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడని కుటుంబీకులు చెప్పారు.

Read Also: IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..

అయితే, కొద్ది క్షణాల తర్వాత దుకాణం యజమాని కృష్ణేందును వెంబడించి, చెంపదెబ్బ కొట్టి, బహిరంగంగా గుంజీలు తీయమని బలవంతం చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిని సంఘటనా స్థలానికి పిలిపించి, తిట్టారు. పిల్లవాడు చిప్స్ ప్యాకెట్‌కి డబ్బులు చెల్లించడానికి ప్రయత్నించానని చెప్పినప్పటికీ, అతను అబద్ధం చెప్పాడని ఆరోపించాడు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలుడు గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. చివరకు అతడిని అపస్మారక స్థితిలో తల్లి, ఇరుగుపొరుగు వారు గుర్తించారు.రూమ్‌లో పరుగుల మందు సీసా ఉండటం, బాలుడి నోటి నుంచి నురగ కారుతుండటంతో, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తించారు. కృష్ణేందును వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసియులో చేర్చారు, కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు. బాలుడి మరణం తర్వాత దుకాణం యజమాని పారపోయాడు.

ఆత్మహత్యకు ముందు బాలుడు సూసైడ్ నోట్ రాశాడు. అందులో..‘‘అమ్మా, నేను దొంగను కాదు. నేను దొంగతనం చేయలేదు. నేను వేచి ఉండగా మామయ్య (దుకాణదారుడు) నా దగ్గర లేడు. తిరిగి వస్తుండగా, రోడ్డు మీద పడి ఉన్న కుర్కురే ప్యాకెట్ ను చూసి దాన్ని తీసుకున్నాను. నాకు కుర్కురే అంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు ఇవే నా చివరి మాటలు, దయచేసి నన్ను క్షమించండి’’ అంటూ పేర్కొన్నాడు.

Exit mobile version