NTV Telugu Site icon

Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..

Mohanlal

Mohanlal

Mohanlal: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటి రిపోర్టు సంచలనంగా మారింది. కేరళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులు, అడ్వాన్సులు, కమిట్‌మెంట్ వంటి అంశాలను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత పలువరు స్టార్ యాక్టర్లపై మహిళా నటీమణులు, హీరోయిన్ల సంచలన ఆరోపణలు చేశారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్టార్ యాక్టర్ జయసూర్యతో పాటు ఎం ముఖేష్ వంటి వారు ఉన్నారు. మాలీవుడ్‌లో జరుగుతున్న భయంకరమైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తుతం పెద్ద చర్చనే నడుస్తోంది. ఈ లైంగిక ఆరోపణల కేసుల్ని విచారించేందుకు కేరళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీరిద్దరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆరోపణలు చేసిన మహిళా యాక్టర్లలో మిను మునీర్, బెంగాలీ నటి శ్రీ లేఖ మిత్ర, సోనియా మల్హర్ వంటి వారు ఉన్నారు.

Read Also: 20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..

ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో ప్రముఖ నటులైన జయసూర్య, సిద్ధిక్, చిత్ర నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ వంటి వారిపై ఆరోపణలు వచ్చాయి. ‘‘హేమా కమిటీ నివేదికను మేము స్వాగతిస్తున్నాము. ఆ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం. అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వదు. ఈ ప్రశ్నలు అందరి నుండి అడగాలి. ఇది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. చాలా మంది ఇందులో పాల్గొంటారు. అయితే దీనికి బాధ్యులు శిక్షించబడతారు, దర్యాప్తు జరుగుతోంది’’ అని అన్నారు.

Show comments