దేశానికి వెన్నెముక అయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. నీటి సౌకర్యాలను కల్పిస్తూ.. ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు. సీఎం హౌస్‌లోని సమత్వ భవన్‌లో కిసాన్ ఆభార్ సమ్మేళన్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వెంటనే అమలు చేయాలని కార్యక్రమంలో ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు.
Also Read:Harish Rao: చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు.. సీఎంకు హరీష్‌రావు సవాల్..
అలాగే, మూడేళ్లలో రైతులకు 30 లక్షల సోలార్ పంపులు ఇస్తామని, రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్ కొనుగోలు చేస్తుందని సీఎం అన్నారు. సీఎం ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది రైతులకు సోలార్ పంపులు ఇవ్వాలని అన్నారు.
Also Read:UK Man Places Upside-Down Statue: రోడ్డుపై గుంతలు.. యువకుడి వినూత్న నిరసన
రైతులకు 24 గంటలు విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, నీరు ఏర్పాటు చేశారని సీఎం అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ లేవని విమర్శించారు. 2003 వరకు రాష్ట్రంలో గోధుమల కొనుగోలుకు ప్రభుత్వ ధర కేవలం రూ.447 మాత్రమే ఉండేదని, దానిని మేము రూ.2600కి పెంచామని తెలిపారు.