Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- భారత భవిష్యత్ పాత్రపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం
- హాని చేయాలనే లక్ష్యంతో కాదని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత భవిష్యత్ పాత్రపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం అని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమ దగ్గర సత్యం మాత్రమే ఉంటే సరిపోదని.. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరమని హితవు పలికారు. అయితే ఒక విషయం ఏంటంటే.. భారత్ ఎవరికీ హాని చేయాలనే లక్ష్యంతో కాకుండా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే దేశంగా ఎదగాలని సూచించారు.
“ప్రపంచం శక్తివంతుల మాటనే ఎక్కువగా వింటుంది. సత్యం ఒక్కటే సరిపోదు. బలం ఉన్నవారికే గౌరవం లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. శక్తివంతమైన దేశాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ఒక దేశాన్ని ఆక్రమించడం, బాంబులు వేయడం, చమురు సరఫరాలను నిలిపివేయడం వంటి చర్యలన్నీ శక్తి ఆధారంగానే జరుగుతున్నాయి. బలహీన దేశాలు మాత్రం వాటికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది” అని వ్యాఖ్యానించారు.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
అలా చేయొద్దు
అయితే భారత్ మాత్రం అలా చేయొద్దని.. అలాంటి లక్ష్యం వద్దని.. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించమని చెప్పడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. “భారత్ ఎవరినీ అణచివేయాలని కోరుకోవడం లేదు. అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటోంది. తన సొంత విలువలు, సూత్రాల ఆధారంగా బలమైన దేశంగా ఎదిగితే ప్రపంచానికి కొత్త దారిని చూపగలదు” అని అన్నారు. సమాజాన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తులు తీర్చిదిద్దినప్పుడే దేశం నిజమైన శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని.. ఆధిపత్యం ద్వారా కాకుండా ధర్మం, నైతికత ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశంగా ఎదగాలని మోహన్ భగవత్ ఆకాంక్షించారు.
#WATCH | Nagpur | RSS Chief Mohan Bhagwat says, "We want to make our country prosperous because the world listens to those who have power; the truth alone is not enough, only strength commands respect; the world is such that the powerful act as they wish while the weak must bow,… pic.twitter.com/uz73UgNOQs
— ANI (@ANI) June 4, 2026
- Tags
- india
- Mohan Bhagwat
- RSS
- RSS Chief
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..