Pratik Sinha, Mohammed Zubair in the race for the Nobel Peace Prize: ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తున్నారు. కాగా..నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 7న ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం శుక్రవారం విడుదల చేసిన అనధికార షార్ట్ లిస్ట్ ప్రకారం భారతదేశం నుంచి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ వ్యవస్థాపకులు ప్రతీక్ సిన్హా, మహ్మద్ జుబైర్ లో పాటు భారతీయ రచయిత హర్ష్ మందర్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు.
Read Also: Adipurush Controversy: భారత సంస్కృతిని అపహాస్యం చేశారు.. విడుదల చేయనివ్వం
2022 నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలు కలిపి మొత్తం 343 మంది పోటీలో ఉన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీతో పాటు బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాట్లావా సిఖానౌస్కాయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని, స్వీడన్ వాతావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు.
జర్నలిస్టులు మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హా భారతదేశంలో తప్పుడు సమాచారంపై పోరాడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లలో ఏది నిజమో ఏది నకిలీదో అని తేలుస్తున్నారు. హర్ష్ మందర్ 2017లో కార్వాన్-ఎ-మొహబ్బత్ (“కారవాన్ ఆఫ్ లవ్”) ప్రచారాన్ని ప్రారంభించారు. మతపరమైన తీవ్రవాదం, అసహనం, హింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మహ్మద్ జుబైర్ ను నాలుగేళ్ల క్రితం ట్వీట్ కేసులో ఈ ఏడాది జూన్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే అతనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. జుబైర్ అరెస్టును ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఖండించారు.