NTV Telugu Site icon

PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ

M 4

M 4

భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో పీటీ ఉష, గోపీచంద్, కోచ్‌లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

 

అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయం 140 మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పారిస్‌కు వెళ్తున్న బృందంతో ఫొటోలు దిగి వారిని ఉత్తేజ పరిచారు.

2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా.. ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి.

2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన 131వ సెషన్‌లో పారిస్‌కు ఆతిథ్య హక్కు లభించింది. పారిస్, లాస్ ఏంజిల్స్‌ నగరాలకు ప్రాధాన్యత లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేక్ డ్యాన్స్ ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవే.