Site icon NTV Telugu

PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య

Modi

Modi

ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా.. విపత్తు సంభవించినా సాయం చేసేందుకు భారతదేశం ముందుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది. శనివారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక నవ రాయ్‌పూర్‌లో ఆధ్యాత్మిక అభ్యాసం, శాంతి, ధ్యానం కోసం నిర్మించిన ఆధునిక కేంద్రమైన బ్రహ్మ కుమారీల “శాంతి శిఖర్”ను మోడీ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏం జరిగినా భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా.. సహాయం చేసేందుకు ముందుకు వస్తుందని.. మొదటి స్పందనగా ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణకు ప్రముఖ స్వరంగా భారత్ ఉంటామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. సంరక్షించుకోవడం మన బాధ్యత.. చాలా అవసరం అన్నారు. మనమంతా ప్రకృతితో సామరస్యంగా జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

ఇక పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ , ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించి.. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Exit mobile version