Site icon NTV Telugu

PM Modi: ఈయూ నేతలతో చర్చించిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

Modi Ursula

Modi Ursula

PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణ, స్థిరత్వం, రక్షణ, భద్రత, సప్లై చైన్ వంటి కీలక రంగాల్లో పురోగతిని నేతలు స్వాగతించారు. భారత్-ఈయూ ఒప్పందం (FTA), ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEEC) ఏర్పాటుకు నేతలు తమ నిబద్ధతను వ్యక్తపరిచారు.

Read Also: NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !

ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్ల భారతదేశ పర్యటను ప్రస్తావిస్తూ, తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నేతలు భారత్ రావాలని ఆహ్వానించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప్రయత్నాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ముగ్గురు నేతలు మాట్లాడారు. శాంతియుత పరిష్కారం, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత నిబద్ధత, మద్దతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరువర్గాలు అంగీకరించాయి.

Exit mobile version