జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిదంబరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదని.. కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభలోగానీ.. రాజ్యసభలోగానీ రాజ్యాంగ సవరణలు ఆమోదించే బలం మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన వెల్లడించారు. ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని చిదంబరం చెప్పారు.
ఇది కూడా చదవండి: Bathing: భర్త “స్నానం” చేయడం లేదని విడాకులు కోరిన మహిళ..
ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదన బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా ఉంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధానమంత్రి మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తరచు జరిగే ఎన్నికలు దేశ ప్రగతికి అవరోధమవుతాయని అన్నారు.
ఇది కూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
జమిలి ఎన్నికల నిర్వహణపై మోడీ 2.0 ప్రభుత్వంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.
ఇది కూడా చదవండి: Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..