PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు బీహార్‌లో పర్యటించారు. పీఎం-కిసాన్ పథకం 19వ విడత నిధుల బదిలీని బీహార్ వేదికగా ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లాలూ కుంభమేళాని విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Virat Kohli: “ఓడినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు”.. ఇస్లామాబాద్‌లో ఫ్యాన్స్ సంబరాలు..
‘‘జంగిల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాని, హిందూ మతాన్ని అపహాస్యం చేశారు. బీహార్ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరు’’ అని అన్నారు. కుంభమేళాని ‘‘ఫాల్తు’’(అర్థరహితం) అని లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన పేరుని నేరుగా ప్రస్తావించకుండా మోడీ విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం,బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రధాని చెప్పారు.
Read Also: Roja: అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించటం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం..
రైతులకు సబ్సిడీ ధరలకు యూరియా అందేలా చేయడంలో ఎన్డీయే ప్రభుత్వానికే ఘనత ఉందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం లేకుంటే అలాంటి ప్రయోజనాలు లభించవని అన్నారు. పాడి పరిశ్రమ కోసం తమ ప్రభుత్వం కృషి చేయడం వల్ల, దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ప్రధాని అన్నారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుని ప్రధాని ప్రకటించారు.