Delhi: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ
- ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన ప్రధాని
- ధన్కర్ దంపతులకు మోడీ దీపావళి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఢిల్లీలోని ధన్కర్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళ్లారు. బుధ, గురువారాల్లో గుజరాత్ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. గురువారం గుజరాత్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని.. ఉప రాష్ట్రపతిని కలిశారు. అంతకముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ.. గుజరాత్‌లోని కచ్‌లో జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. అందరికీ స్వయంగా స్వీట్లు పంచి ఇచ్చారు. వారితో సరాదా గడుపుతో.. సంభాషించారు. సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చేతులతో సైనికులకు మిఠాయిలు తినిపించారు. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా దగ్గర బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే అవకాశం లభించడం అత్యంత సంతోషకరమని సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడని ప్రభుత్వం మన దేశంలో ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ రోజు మనం మన సైన్యాలను, మన భద్రతా బలగాలను ఆధునిక వనరులతో సన్నద్ధం చేయడం ద్వారా ఆధునిక సైనిక శక్తిని సృష్టిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. తాము తమ సైన్యాన్ని ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల ర్యాంక్‌లో ఉంచుతామని.. తమ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో స్వావలంబన అని ప్రధాని మోడీ తెలిపారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan and extended her #Diwali greetings.
(Video: DD News) pic.twitter.com/Bt3gP2sDML
— ANI (@ANI) October 31, 2024
#WATCH | Delhi: Prime Minister Narendra Modi called on Vice President Jagdeep Dhankhar and extended him #Diwali greetings.
(Video: DD News) pic.twitter.com/VmfO3rZcO6
— ANI (@ANI) October 31, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!