ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఢిల్లీలోని ధన్‌కర్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళ్లారు. బుధ, గురువారాల్లో గుజరాత్ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. గురువారం గుజరాత్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని.. ఉప రాష్ట్రపతిని కలిశారు.
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ.. గుజరాత్‌లోని కచ్‌లో జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. అందరికీ స్వయంగా స్వీట్లు పంచి ఇచ్చారు. వారితో సరాదా గడుపుతో.. సంభాషించారు. సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చేతులతో సైనికులకు మిఠాయిలు తినిపించారు. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా దగ్గర బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే అవకాశం లభించడం అత్యంత సంతోషకరమని సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడని ప్రభుత్వం మన దేశంలో ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ రోజు మనం మన సైన్యాలను, మన భద్రతా బలగాలను ఆధునిక వనరులతో సన్నద్ధం చేయడం ద్వారా ఆధునిక సైనిక శక్తిని సృష్టిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. తాము తమ సైన్యాన్ని ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల ర్యాంక్‌లో ఉంచుతామని.. తమ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో స్వావలంబన అని ప్రధాని మోడీ తెలిపారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi called on Vice President Jagdeep Dhankhar and extended him #Diwali greetings.
(Video: DD News) pic.twitter.com/VmfO3rZcO6
— ANI (@ANI) October 31, 2024