NTV Telugu Site icon

Santosh Bangar: ఉద్దవ్‌ కోసం ఎక్కి ఎక్కి ఏడ్చిన ఎమ్మెల్యే.. ట్విస్ట్‌ మామూలుగా లేదు..!

Santosh Bangar

Santosh Bangar

ఉద్దవ్‌ థాక్రేపై శివసేన నేత ఏక్‌నాథ్‌ సిండే తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మలుపు, ట్విస్ట్‌లు, బిగ్‌ ట్విస్ట్‌లు.. ఇలా సాగుతూ పోయింది.. చివరకు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ సిండేను ఎన్నుకోవడం, ప్రమాణం చేయడం.. ఫైనల్‌గా 286 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 164 ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాసపరీక్షలో కూడా ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. అయితే, ఓ శివసేన ఎమ్మెల్యే చేసిన హడావిడి.. చివరకు ఇచ్చిన ట్విస్ట్‌తో.. ఉద్దవ్‌ థాక్రే, శివసేన శ్రేణులు ఏమో గానీ.. షాక్‌కు గురైన నెటిజన్లు.. ఇప్పుడు తెగ వైరల్‌ చేస్తున్నారు.. ఇంతకీ ఆ ఎమ్మెల్యే చేసింది ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

Read Also: HYD Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది

షిండే తిరుగుబాటుతో వరుసగా ఎమ్మెల్యేలు.. ఉద్దవ్‌ థాక్రేకు గుడ్‌బై చెబుతూ పోయారు.. క్రమంగా షిండే బలం పెరిగింది.. ఉద్దవ్‌ నెత్తికి చేతులు పెట్టాల్సిన పరిస్థితి.. అయితే, శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. చివరి వరకు ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నిలిచాడు.. గత వారం ఆయన ఉద్దవ్‌కు మద్దతుగా ఓ సమావేశం కూడా నిర్వహించారు.. కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. భావోద్వేగానికి లోనయ్యారు.. ఉద్దవ్‌జీకి మద్దతుగా ఉండాలంటూ.. తన మద్దతుదారులను కోరుతూ కన్నీరు మున్నీరయ్యారు.. అంత వరకు బాగానే ఉంది.. ఆ డ్రామా అంతా ముగిసిన తర్వాత, ఆయన విశ్వాస పరీక్షకు గంటల ముందు ఏకనాథ్ షిండే క్యాంపులో చేరడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో అవసరమైన ఓట్ల కంటే 20 ఎక్కువ ఓట్లతోనే ప్లోర్‌టెస్ట్‌ నెగ్గారు.. 288 మంది సభ్యులున్న సభలో 164 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు. అయిటే, థాక్రేకే తన మద్దతు అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. చివరి నిమిషంలో షిండే శిబిరంలో చేరడం చర్చగా మారింది..

థాక్రేకు గొప్ప అనుచరుడు భావిస్తున్న సంతోష్ బంగర్.. చివరి నిమిషంలో షిండే గ్రూప్‌లో ప్రత్యక్ష్యం కావడంతో శివసేన శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.. మహారాష్ట్ర అసెంబ్లీలో కీలకమైన బలపరీక్షకు ముందు బంగర్ జంప్ అయ్యారు. ఆదివారం కొంత ఆలస్యంగా ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. కొత్త ముఖ్యమంత్రి బస చేసిన ముంబైలోని హోటల్‌కు వెళ్లారు.. మీకు తన మద్దతు అంటూ ప్రకటించాడు.. అయితే, ఉద్ధవ్ థాక్రే తనఎమ్మెల్యేలను షిండే శిబిరంలో చేరనీయకుండా విశ్వప్రయత్నాలు చేస్తోన్న సమయంలో.. జూన్ 24న బంగర్ తన నియోజకవర్గంలోని ప్రజలను ఉద్దేశించి వీడియోను పోస్ట్ చేసాడు, థాక్రేల పక్షాన నిలబడమని తన అనుచరులను కోరుతూ ముకుళిత హస్తాలతో ఏడుస్తూ.. మాట్లాడిన వీడియోను ఆయనే స్వయంగా పోస్ట్‌ చేశాడు.. థాక్రేపై తన విధేయతను ప్రకటించినప్పుడు ఆ వీడియోలు బంగర్ ఏడుస్తున్నాడు.. అంతేకాదు తిరిగి రావాలని ఏక్‌నాథ్‌ షిండేను వేడుకున్నాడు. ఇప్పుడే ఆయనే షిండే వర్గంలో చేరిపోయాడు..