NTV Telugu Site icon

MK Stalin: కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్‌పై సీఎం స్టాలిక్ కీలక వ్యాఖ్యలు

Mkstalinudhayanidhi

Mkstalinudhayanidhi

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఇదే అంశంపై సీఎం స్టాలిన్ మీడియాతో స్పందించారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేసే సమయం ఇంకా రాలేదని.. పార్టీలో మాత్రం డిమాండ్ గట్టిగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయనిధి తమిళనాడు కేబినెట్‌లో క్రీడా, యువజన సంక్షేమం, ప్రత్యేక కార్యక్రమాల మంత్రిగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Heera Gold: హీరా గోల్డ్ లో ముగిసిన సోదాలు.. భారీగా అక్రమ సంపాదన..

సోమవారం ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, దానిని పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడిగారు. పార్టీలో డిమాండ్ ఉందని.. కానీ దానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ఎంకే.స్టాలిన్.. తండ్రి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే కోవలో ఉదయనిధిని కూడా డిప్యూటీ సీఎంను చేయొచ్చని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే స్టాలిన్ మాత్రం కొట్టిపారేయలేదు. సమయం వచ్చినప్పుడు చేస్తామన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అంటే ఏదొక రోజు జరిగే అవకాశం మాత్రం ఉందని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Bangladesh protests: భారత సైన్యం అప్రమత్తం.. సరిహద్దుల్లో హైఅలర్ట్

Show comments