MK Stalin: రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం.. తీవ్ర విమర్శలు చేసిన సీఎం స్టాలిన్…
- రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం..
- లోక్ భవన్‌గా పేరు మార్చడంపై సీఎం స్టాలిన్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ సమస్య పేర్ల గురించి కాదని, ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం గురించి అని అన్నారు. ఈ పేరు మార్పులు అనవసరమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధకారాన్ని గౌరవించడంలో నిజమైన జవాబుదారీతనం ఉందని చెప్పారు.
Read Also: Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 11 మంది మృతి..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
‘‘పేరు మార్చడం మనస్తత్వాన్ని మార్చడం కంటే ముఖ్యమైంది కాదు. శాసన సభ= ప్రజల సభ. శాసనసభను గౌరవించని వారు, లోక్ భవన్‌గా పేరు మార్చడం కంటితుడుపు చర్య.’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే సార్వభౌమ శాసనసభను గౌరవించడం ఈ కాలపు అవసరమని ఆయన అన్నారు. ఆలోచనలు, చర్యల్లో మార్పు లేకపోతే, ఇది కూడా అనవసరం అని అన్నారు. శాసనసభ పాత్రను సమర్థించని వారు గవర్నర్ నివాసం పేరు మార్చితే లాభమేంటని అన్నారు.
తమిళనాడుకు ముందు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ శనివారం కోల్‌కతాలోని రాజ్ భవన్ పేరును మార్చాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేశారు. డార్జిలింగ్ నివాసాన్ని లోక్ భవన్‌గా మార్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారానికి అనుగుణంగా పేరు మార్పు ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. ఇక అన్ని అధికారిక కార్యక్రమాల్లో పేరు మార్పు కనిపిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!