Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mk Stalin Defeated Kolathur Tvk Vs Babu Victory Tn Election Results 2026

CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం

Published Date :May 4, 2026 , 4:06 pm
By Shiva Ganesh
  • తమిళ రాజకీయాల్లో పెను సంచలనం
  • సొంత నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓటమి..
  • 'దళపతి' పార్టీ అభ్యర్థి బాబు ఘనవిజయం
CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM MK Stalin Loses: తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన, అత్యంత సంచలనాత్మకమైన ఘట్టం నమోదైంది. గత పదిహేనేళ్లుగా ఎదురులేని నాయకుడిగా, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె.స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంతో సంచలన విజయం సాధించారు. 2011 నుంచి వరుసగా మూడుసార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న స్టాలిన్‌కు ఓటర్లు ఈసారి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనుల కంటే, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు కోరుకునే యువ ఓటర్ల నిర్ణయం స్టాలిన్ కొంపముంచినట్లు కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విజయ్ ‘విక్టరీ’ కేవలం సినిమాటిక్ కాదు..
ఈ ఫలితం ద్వారా ‘దళపతి’ విజయ్ రాజకీయ ప్రవేశం కేవలం ఒక గాలివాటం కాదని, అది ఒక శక్తివంతమైన ప్రభంజనమని రుజువైంది. టీవీకే పార్టీ అభ్యర్థి వి.ఎస్.బాబు అట్టడుగు స్థాయి నుంచి ప్రచారం నిర్వహించి, అధికార పార్టీ యంత్రాంగాన్ని ఎదిరించి గెలవడం గమనార్హం. ఈ ఓటమికి ప్రధాన కారణం.. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్యే సాగుతున్న అధికారాన్ని ఈసారి కొత్త శక్తికి అప్పగించాలని కొలత్తూరు ఓటర్లు నిర్ణయించుకోవడం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత, విద్యావంతులు విజయ్ నినాదాలకు ఆకర్షితులు కావడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పసిగట్టడంలో డీఎంకే విఫలమవ్వడం, స్టాలిన్ ఓటమికి దారితీసిందని అంటున్నారు. ఈ చారిత్రక ఓటమితో తమిళనాడులో 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరపడి, ఒక నూతన రాజకీయ శకం మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ స్థానం నుంచి 4319 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

Also Read

  • SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. "కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!"
  • Vijay TVK: "బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే 'తుపాకీ'! విజయ్ సీఎం అవుతాడా?
  • West Bengal Results: తృణమూల్ కోటలో 'కమల' వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
  • Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KolathurResults
  • MKStalinDefeated
  • StalinLoses
  • TNElectionResults2026
  • TNPolitics

తాజావార్తలు

  • Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

  • CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం

  • Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..

  • SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!”

  • Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?

  • Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions