DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- డీఎంకే, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న దూరం..
- ఎస్ఐఆర్ విషయంలో కాక్రోచ్ పార్టీకి స్టాలిన్ మద్దతు..
- త్వరలో అభిజిత్ దీప్కేను కలిసే అవకాశం..
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న డీఎంకే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, టీవీకే గెలిచిన తర్వాత డీఎంకేను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన చేరారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ వెన్నుపోటుగా డీఎంకే వర్ణిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్‌కు డీఎంకే దూరం పాటిస్తూనే.. SIR, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి మద్దతు తెలుపుతోంది.
కాంగ్రెస్‌కు కటీఫ్..
చెన్నైలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఎస్ఐఆర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలపాలని, సీజేపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తన ఎంపీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో తమకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు స్టాలిన్ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ ‘‘ద్వంద్వ వైఖరి’’ని అవలంభిస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
సీజేపీకి మద్దతుగా స్టాలిన్..
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా సీజేపీకి మద్దతుగా ఎక్స్ వేదికగా స్టాలిన్ పలు పోస్టులు పెడుతున్నారు. సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే, కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ నిర్బంధాలపై ఆయన స్పందించారు. దీప్కే నిర్భందాన్ని వ్యతిరేకించారు. కేంద్రం అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసనల్ని మరింత బలోపేతం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. దీప్కే, నేహా బోరాలను నిర్బంధించడం చట్టవిరుద్ధమని, కేంద్రం వారిని తక్షణమే విడుదల చేయాలని ఎక్స్ పోస్టులో డిమాండ్ చేశారు.
థర్డ్ ఫ్రంట్ దిశగా డీఎంకే..
గత కొన్ని రోజులుగా డీఎంకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ కనిమొళి, శరద్ పవార్ ఎన్సీపీ, టీఎంసీలతో భేటీ అయ్యారు. ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి దూరంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమిలోకి సీజేపీని కూడా ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే కొన్ని రోజుల్లో అభిజిత్ దీప్కేను స్టాలిన్ కలవచ్చనే నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో గెలిచిన విజయ్ టీవీకే, ఓడిపోయిన డీఎంకే రెండు కూడా ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
#WATCH | Tamil Nadu: Former CM and DMK president MK Stalin chairs a meeting of party MPs on various issues, including SIR. Visuals from the party headquarters. https://t.co/5xxVtovIMv
— ANI (@ANI) October 17, 2026
తాజావార్తలు
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
-
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!