ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత కేటాయించారు. ఇటీవల బాలీవుడ్ నటులకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తి కూడా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను పెంచింది. మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు. దీంతో ఆయనకు కేంద్రం భద్రత పెంచింది.
ఇది కూడా చదవండి: AP Whips and Chief Whips: చీఫ్ విప్, విప్‌లను నియమించిన ఏపీ సర్కార్
ఇదిలా ఉంటే కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్ ఏరియాలో అక్టోబర్ 27న జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిథున్ చక్రవర్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ 6న ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం అవుతుందని, లక్ష్యసాధన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమేనని మిథున్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈస్ట్ సింగ్భూమ్ జిల్లాలో మిథున్ రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తరఫున ఆయన ప్రచారం చేశారు.
ఇది కూడా చదవండి: Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘‘లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్’’ సక్సెస్..