Site icon NTV Telugu

Indian student: విషాదం.. కాలిఫోర్నియాలో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి

Saketh

Saketh

Indian student: వారం రోజుల క్రితం అమెరికాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి శవంగా కనిపించారు. 22 ఏళ్ల విద్యా్ర్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ ఆదివారం తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్థానిక అధికారుల సమన్వయంతో మృతదేహాన్ని భారత్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది.

Read Also: Asaduddin Owaisi: “టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ప్రేమలేఖలు రాయలేదు”.. మాలేగావ్ వివాదంపై ఓవైసీ..

సాకేత్ తప్పిపోయే ముందు చివరిసారిగా కాలిఫోర్నియాలోని బర్కిలీ కొండలలోని లేక్ అంజా సమీపంలో కనిపించారు. ఫిబ్రవరి 9న అతను కనిపించకుండా పోయిన తర్వాత బెర్క్‌లీ హిల్స్, లేక్ అంజా పరిసరాల్లో పోలీసులు, స్థానికులు, విద్యార్థులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిల్డెన్ రీజినల్ పార్క్ దగ్గర అతడి బ్యాక్‌ ప్యాక్ దొరకడంతో అనుమానాలు పెరిగాయి. చివరకు అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

కర్ణాటకకు చెందిన సాకేత్ ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నారు. సాకేత్ మిస్సైన తర్వాత అతడి రూమ్‌మేట్ బనీత్ సింగ్ సోషల్ మీడియాలో సాయం కోసం పోస్ట్ చేశాడు. దీని తర్వాత, కర్ణాటక చీఫ్ సెక్రటరీ శాలిని రజనీష్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. భారత కాన్సులేట్, యూఎస్ పోలీసుల సహాకారంతో అతడి మృతదేహాన్ని గుర్తించారు.

Exit mobile version