NTV Telugu Site icon

Miss Switzerland: మాజీ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టినా హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన కోర్టు

Missswitzerland

Missswitzerland

మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్‌ క్రిస్టినా జోక్సిమోవిక్‌‌ను భర్త థామస్‌నే చంపినట్లుగా న్యాయస్థానం తేల్చింది. ఆత్మ రక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆత్మ రక్షణ దేని కోసమో క్లారిటీ రాలేదు.

38 ఏళ్ల మాజీ మోడల్ క్రిస్టినా జోక్సిమోవిక్ ఫిబ్రవరి 13న బిన్నింగెన్‌లోని తన నివాసంలోని లాండ్రీ గదిలో చనిపోయినట్లు గుర్తించారు. ఆమె భర్త థామస్‌నే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ముక్కలు.. ముక్కలు చేసి రసాయనాలతో దహనం చేశాడు. క్రిస్టినా, థామస్ 2017లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తనకు పరిపూర్ణ కుటుంబంలా కనిపించారని జోక్సిమోవిక్ స్నేహితురాలు తెలిపింది.

లాండ్రీ గదిలో ఒక జా, కత్తి, గార్డెన్ షియర్స్ ఉపయోగించి ఆమె శరీరం ముక్కలు చేయబడింది. ఆమె అవశేషాలను హ్యాండ్ బ్లెండర్ ‘ప్యూరీడ్’తో కత్తిరించి రసాయన ద్రావణంలో కరిగించారు. ఆమె మరణానికి ముందు జోక్సిమోవిక్ గొంతు కోసి చంపబడిందని కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలి మృతదేహం దొరికిన మరుసటి రోజే థామస్‌ను అరెస్టు చేశారు. మొదట్లో ఆమె మామూలుగానే చనిపోయినట్లు తెలిపాడు. అయితే భయాందోళన నేపథ్యంలో ఆమెను ముక్కులు చేసి  రసాయనాలతో దహనం చేశాడు. ఈ ఘటనలో నిందితుడి మానసిక పరిస్థితి బాగులేన్నట్లుగా తెలుస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ జంట బాసెల్‌లోని సంపన్న ప్రాంతంలో విశాలమైన సెమీ డిటాచ్డ్ హౌస్‌లో నివసించారు. హత్యకు నాలుగు వారాల ముందు క్రిస్టినా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జంటల ఫోటోలను షేర్ చేసింది. జోక్సిమోవిక్ 2007 మిస్ స్విట్జర్లాండ్ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. గతంలో మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్‌గా కిరీటాన్ని పొందారు. ఆ తర్వాత క్యాట్‌వాక్‌ కోచ్‌గా మారింది.