NTV Telugu Site icon

MonkeyPox: మంకీపాక్స్ పై కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ

Monkeypox

Monkeypox

ఇన్నాళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఇండియాలో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళ తిరువనంతపురానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే అతనికి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు ఉండటంతో శాంపిళ్లను పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. మంకీపాక్స్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

తాజాగా మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇతరులకు దూరంగా ఉండాలని..ముఖ్యంగా చర్మం గాయాలు ఉన్నవారికి దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది. చనిపోయిన లేదా జీవించి ఉన్న అడవి జంతువులు, ఉడతుల, ఎలుకలు, కోతులు వంటి వాటి దూరంగా ఉండాలని.. అటవీ జంతువుల మాంసాన్ని దూరంగా ఉండాలని.. వ్యాధులతో బాధపడుతున్నవారి వస్తువులను వాడకుండా ఉండాలని సూచించింది. మంకీపాక్స్ సంబంధించి ఎలాంటి లక్షణాలు ముఖ్యంగా శరీరంపై దద్దర్లు ఉన్నవారు వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.

Read Also: CM KCR: కేంద్రంపై పోరాటం.. జాతీయ నేతలకు కేసీఆర్‌ ఫోన్లు..

ఇదిలా ఉంటే దేశంలో మంకీపాక్స్ నిర్థారణ కోసం దేశవ్యాప్తంగా 15 వైరస్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ లేబరేటరీలు శిక్షణ పొందాయని.. వీరందరికి పూణేలోని ఐసీఎంఆర్, ఎన్ఐవీ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాల్లో 8వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి.ముఖ్యంగా యూరప్ దేశాల్లోనే 80 శాతానికి పైగా కేసులు నమోదు అయ్యాయి. మే మొదటి వారంలో బ్రిటన్ లో మంకీపాక్స్ కేసుల నమోదు అయింది. ఆ తరువాత యూరప్ లోని జర్మనీ, స్పెయిన్, బెల్జియం, ప్రాన్స్ వంటి ఇతర దేశాలకు వ్యాపించింది. యూఎస్ఏ, ఇజ్రాయిల్, యూఏఈ తాజాగా ఇండియాలో కూడా కేసులు నమోదు అయ్యాయి.