Site icon NTV Telugu

Puvvada Ajay Kumar: ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తాం…

Puvvada

Puvvada

Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్‌స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్‌ఎస్‌ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభించిన అతిపెద్ద ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పూర్తి చేసుకున్నామని.. ప్రాజెక్టు నుంచి సాగునీరు సైతం రైతులకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..

సీతారామ ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్‌ వాళ్లు కేసులు పెట్టి అడ్డు పడుతున్నారని విమర్శించారు. కొంత మందికి ఈ ప్రాజెక్టు కట్టడం కడుపునొప్పిగా ఉందని .. అందుకే అడ్డుకుంటున్నారని మంత్రి అన్నారు. అధికారం ఉన్నంత కాలం డబ్బులు, అధికారం అనుభవించి ఇప్పుడు కేసీఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. 10కి 10 గెలుస్తామని చెబుతున్నారు.. మీరు ఆయన జేబులో ఏమైనా ఉన్నారా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. తాము అరాచకం చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగుతారా? అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు.

రాబోయే రోజులు చాలా ముఖ్యమని.. పార్టీ కోసం పనిచేయాలని.. మూడోసారి తిరిగి అధికారంలోకి రావాలని సూచించారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్యక్తి ఓటుకు నోటు కేసులో నిందితుడని మంత్రి పువ్వాడ విమర్శించారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. తనకు వడదెబ్బ తగిలిందని.. అయినా ఏమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 సీట్లను గెలిపించడం కోసం జిల్లా మొత్తం తిరుగతానని మంత్రి అజయ్ కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 150 దాకా పొగొట్టుకున్నానని.. తాను తన కుటుంబం పంచిపెట్టేదే తప్ప దాచిపెట్టుకోవడానికి తీసుకునేది ఏమీ లేదన్నారు. తనపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తారని.. వాటిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version