NTV Telugu Site icon

Milkipur Bypoll: అయోధ్యలో అప్పుడు ఓడింది.. ఇప్పుడు విజయం దిశగా బీజేపీ..

Milkipur Bypoll

Milkipur Bypoll

Milkipur Bypoll: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఉంది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలోనే అయోధ్య రామమందిరం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అవధేశ్ ప్రసాద్ గెలుపొందారు. రామమందిర నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత బీజేపీ ఓడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read Also: Congress: దశాబ్ధాల చరిత్ర ఉన్నా.. దేశ రాజధానిలో పత్తాలేని కాంగ్రెస్..

ఇదిలా ఉంటే, అవధేశ్ ప్రసాద్ ఎంపీగా గెలవడంతో మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. శనివారం ఓట్ల లెక్కింపులో బీజేపీ ఈ స్థానంలో విజయం దిశగా కొనసాగుతోంది. అయోధ్యలో ఈ సారి ఎలాగైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే మిల్కీపూర్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ నుంచి అజిత్ ప్రాదస్, బీజేపీ నుంచి చంద్రభాను పాస్వాన్ పోటీలో ఉన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. మిల్కిపూర్‌లో బీజేపీ అభ్యర్థి హవా కొనసాగుతోంది. చంద్రభాను పాస్వాన్ ఏకంగా 10,000 కన్నా అధిక ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 5న మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 3.70 లక్షల మంది ఓటర్లలో 65 శాతం కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని అధిగమించింది.