MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
Read Also: Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
అయితే, ఇటీవల ఈ విమానాలు తరుచుగా కూలిపోతుండటంతో, వీటిని రిప్లేస్ చేయాలని భారత సైన్యం భావించింది. 400 కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. చాలా ప్రమాదాల్లో పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటికి ‘‘ఎగిరే శవపేటిక’’ అనే పేరు వచ్చింది. 1960లలో ప్రవేశపెట్టిన నుంచి MiG-21 అనేక అప్‌గ్రేడ్‌లు చేయబడ్డాయి. మిగ్-21ని సోవియట్ యూనియన్‌లోని మికోయన్-గురేవిచ్ డిజైన్ బ్యూరో రూపొందించింది. దాదాపు 60 దేశాలు ఈ జెట్ ఫైటర్‌ని ఉపయోగించాయి.
స్వదేశీ తయారీ LCA తేజస్ Mk1Aను మిగ్-21 స్థానంలో రిప్లేస్ చేయనున్నారు. అయితే, పదే పదే డెలివరీ జాప్యాల వల్ల మిగ్-21 విమానాల జీవిత కాలం పొడగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 31 విమానాలతో కూడిన MiG-21 బైసన్ రెండు స్క్వాడ్రన్‌లను భారత వైమానిక దళం నిర్వహిస్తోంది. MiG-21ల విరమణతో, భారత వైమానిక దళం యొక్క పోరాట బలం 29 స్క్వాడ్రన్‌లకు పడిపోతుంది, 1960ల తర్వాత ఇది అత్యల్పం. ఈ సంఖ్య 1965 యుద్ధం కంటే తక్కువగా ఉంది. ఐఏఎఫ్ కు కావాల్సిన 42 స్వ్కాడ్రన్ల కన్నా తక్కు.
