Metro Pillar Collapse: బెంగళూర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్లర్ కూలింది. ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కుటుంబంపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన తల్లి, రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు.
Read Also: Sabiramala: శబరిమల ఆలయంపై కేరళ హైకోర్టు తీర్పు.. వారిని అనుమతించవద్దని ఆదేశాలు
బెంగళూర్ లో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లలు కూలడంతో బైక్ పై వెళ్తున్న కుటుంబం ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటన నగరంలోెని నాగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. కల్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న భార్యభర్తలు, రెండున్నరేళ్ల పిల్లాడు గాయాలపాలయ్యారు. హుటాహుటిని వారిని నగరంలోని ఆల్టిస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. 25 ఏళ్ల తేజస్వి, ఆమె కుమారుడు విహాన్ మరణించారు. భర్త తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో బాధిత కుటుంబం హెబ్బాల్ వైపు వెళ్తున్నారు.
Read Also: N.V.S.S. Prabhakar: కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారు
