NTV Telugu Site icon

Meta Layoff: ఉద్యోగం కోసం ఇండియా నుంచి యూకేకి.. 2 నెలలకే జాబ్ నుంచి పీకి పారేశారు..

Meta

Meta

Meta Layoff: ఐటీ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియడం లేదు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అయిన మెటా, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను పీకి పారేస్తున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మూడో విడుతగా చివరి లేఆఫ్స్ ప్రకటించింది. 6000 మంది ఉద్యోగులను తీసేస్తోంది. ఇందులో ఇండియాలో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో 4000 మందిని తొలగించిన మెటా.. ప్రస్తుతం ఆరు వేల మందిని తీసేస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ వెబ్సైట్ లింక్డ్‌ఇన్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ బాధలను పంచుకుంటున్నారు.

Read Also: Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

తాజాగా ఓ ఉద్యోగి భారతదేశం నుంచి యూకేకు వెళ్లాడు. తాజా మెటా లేఆఫ్స్ లో జాబ్ కోల్పోయాడు. తాను యూకేకి వెళ్లి 2 నెలలు మాత్రమే అవుతున్నట్లు తెలిపారు. మెటాలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రస్తుతం తన జాబ్ కోల్పోయాడు. ప్రస్తుతం తన జాబ్ పోయిందని.. నేను ఇప్పుడు కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నానని, యూకే, యూరప్, ఇండియాలో ఎక్కడైన పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లింక్డ్ఇన్ పోస్ట్ లో వెల్లడించాడు.

ఇలాగే మరో ఇండియన్ టెక్కీ తన లేఆఫ్ స్టోరీని లింక్డ్ఇన్ లో పంచుకున్నారు. న్యూ జెర్సీలో తన సోదరుడి కాన్వకేషన్ కు హాజరైన సమయంలో తన తొలగింపు గురించి తెలుసుకున్నట్లు సదరు మహిళ ఉద్యోగి వెల్లడించారు. ఉద్యోగం కోసం న్యూ జెర్సీ నుంచి కాలిఫోర్నియా వెళ్లిన ఏడాది తర్వాత తనకు పింక్ స్లిప్ ఇచ్చి ఇచ్చినట్లు వెల్లడించారు. వృత్తిపరంగా మెటాలో నాకు ఏడాది పాటే పనిచేసే అవకాశం వచ్చిందని.. జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలను ఇచ్చిందని, ఈ కష్టకాలంలో ధృడంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని పోస్ట్ చేశారు.

Show comments