Site icon NTV Telugu

Mark Zuckerberg: లోక్‌సభ ఎన్నికలపై మార్క్ జుకర్‌బర్గ్‌ సంచలన వ్యాఖ్యలు.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

Neta

Neta

Mark Zuckerberg: ఇటీవల భారతలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే మెటా రియాక్ట్ అవుతూ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. అనుకోకుండా జరిగిన పొరపాటును మీరు క్షమించాలని పేర్కొన్నారు.

Read Also: Hyderabad: పసి పాపకు శాపంగా మారిన ప్రేమ వ్యవహారం..

అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ చేసిన వాదనను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్రంగా ఖండించారు. గతేడాది భారత్‌ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయంటూ జుకర్‌బర్గ్‌ తప్పుగా చెప్పారు అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి విజయం కట్టుబెట్టారనే విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని భారత ప్రభుత్వానికి మెటా క్షమాపణలు చెప్పుకొచ్చింది.

Exit mobile version