Sharad Pawar: లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర భారతదేశం, పార్లమెంట్‌ల మనస్తత్వం ఇంకా అనుకూలంగా లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. శనివారం పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో ముఖాముఖిలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని, ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా…దీనికి ఆయన సమాధామిస్తూ…తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు.
Union Minister Kiren Rijiju: కొలీజియ వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది..
ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్, పంచాయతీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడ్డాయన్నారు. మొదట ప్రజలు దీనిని వ్యతిరేకించారని.. కానీ తర్వాత ప్రజలు దీనిని ఆమోదించారని శరద్ పవార్ స్పష్టం చేశారు.
