NTV Telugu Site icon

Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిందంటే..?

Delhi Court

Delhi Court

Delhi Court: మహిళలకు ఇచ్చే ప్రత్యేక అధికారాలను సొంత ప్రయోజనాల కోసం ‘కత్తి’లా వాడకూడదని, తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులును ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదనపు సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాలా టాండన్ ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు నిందితుడి జీవితాన్ని, ప్రతిష్ట, సామాజిక గౌరవాన్ని నాశనం చేస్తాయని అన్నారు. నిందితుడి బెయిల్ పిటిషన్‌ని విచారిస్తూ, కోర్టు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో వాస్తవాన్ని గ్రహించిన కోర్టు, సదరు మహిళ నిందితుడితో ఇష్టపూర్వకంగానే హోటల్‌కి వెళ్లిందని, ఏకాభిప్రాయంతోనే లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది.

అయితే, నిందితుడితో గొడవపడిన తర్వాత.. మహిళ పోలీసులను పిలిపించి అతడి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. ఈ కేసులో వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగలో పొందుపరిచిన చట్టం ప్రకారం. మన దేశంలో పరుషులకు కూడా సమాన హక్కులు, రక్షణ ఉన్నాయని, అయితే మహిళలకు ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయని కోర్టు పేర్కొంది. ఈ హక్కుల్ని, చట్టాలని తమ సొంతానికి వినియోగించకూడదని సూచించింది.

Read Also:Sonam Wangchuk: లడఖ్‌పై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..

‘‘ఈ రోజుల్లో అనేక ఇతర కారణాలతో రేప్ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇది కూడా ఇలాంటి కేసుల్లో ఒకటి. తప్పుడు అత్యాచార ఆరోపణలు పేరున్న వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అతడి ప్రతిష్టని నాశనం చేస్తాయి.’’ అని కోర్టు పేర్కొంది. అత్యాచారం అనేది అత్యంత హేయమైన, బాధాకరమైన నేరమని కోర్టు చెప్పింది. ఎందుకంటే ఇది బాధితురాలి ఆత్మతో పాటు ఆమె శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలా అత్యాచార చట్టం దుర్వినియోగాని గురువుతోందని కోర్టు చెప్పింది.

కోపంతో, మత్తులో ఉన్న స్థితిలో మహిళ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు అగిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదు కారణంగా బాధితుడు 10 రోజుల జైలులో ఉన్నాడని చెప్పింది. ఇలాంటి కేసుల్లో పోలీసులు తొందరపడొద్దని సూచించింది.

Show comments