హనీమూన్ మర్డర్ కేసులో మేఘాలయ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇక సోనమ్ రఘువంశీ-రాజ్ కుష్వాహ మధ్య సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇద్దరు కూడా బంధం ఉన్నట్లు ఒప్పుకున్నారని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సాయిమ్ తెలిపారు. సోనమ్ రఘువంశీ, రాజ్ కుష్వాహ బంధానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. నార్కో పరీక్షలు నిర్వహించడం లేదని.. బాధిత కుటుంబం డిమాండ్‌ను అంగీకరించడం లేదని చెప్పారు. ఆధారాలు లేనప్పుడు మాత్రమే నార్కో పరీక్షలు నిర్వహిస్తారని.. అన్ని ఆధారాలు లభించాక ఇంకెందుకు అని ప్రశ్నించారు. నార్కో పరీక్షను సుప్రీం కోర్టు నిషేధించిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Off The Record: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు
నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పాటు బలమైన సాక్ష్యాలను కూడా సేకరించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఛార్జిషీట్‌ను వేస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే రాజా రఘువంశీతో సోనమ్ పెళ్లికి ఒప్పుకుందని తెలిపారు. ఇక నిందితులకు ఇండోర్‌లో లోకేంద్ర తోమర్ ఫ్లాట్ ఇచ్చాడు. లోకేంద్ర తోమర్‌ను కూడా విచారించనున్నారు. సోనమ్ అరెస్ట్ కాకముందు ఇండోర్‌లోని ఫ్లాట్‌లో ప్రియుడితో ఉందని చెప్పారు. సోనమ్.. ఫ్లాట్‌లో వదిలేసిన బ్యాగ్‌లో ఒక దేశీయ పిస్టల్, ఆమె ఫోన్, రాజాకు చెందిన నగలు, రూ.5లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని లోకేంద్ర తోమర్ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాటి కోసం ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sugavasi Subramanyam: నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత.. రాజకీయంగా టీడీపీకి దెబ్బే!
మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కు వివాహం అయింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వచ్చారు. మే 23న ముగ్గురు హంతకులతో కలిసి సోనమ్.. భర్తను చంపి లోయలో పడేసింది. అనంతరం ఇండోర్‌లో ప్రియుడితో సోనమ్ మకాం పెట్టింది. జూన్ 8న ఘాజీపూర్‌లో సోనమ్ లొంగిపోయింది. నిందితులంతా నేరాన్ని అంగీకరించారు.