McDonald’s: మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
McDonald’s: వర్షాభావ పరిస్థితులు, హీట్ వేవ్ కారణాల వల్ల దేశంలో టమాటా పంట దెబ్బతింది. వెరసి దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. కిలో టమాటా ధర రూ. 200లను దాటింది. సామాన్యుడు టమాటాలను కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డొనాల్డ్స్ కి కూడా టమాటా దెబ్బ తాకింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తమ స్టోర్లలో బర్గర్లు, రాప్ ల నుంచి టమాటాను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
Read Also: Supreme Court: వివాహేతర సంబంధాల రుజువుకు కాల్ రికార్డ్.. గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందా..?
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
బర్గర్లు, రాప్ లలో టమాటాలు చాలా కీలకం.. అయితే ఇప్పుడు వాటిలో ఇవి ఉండవన్నమాట. దేశంలో సరఫరాలో సమస్యలు, టమాటా నాణ్యత దెబ్బతినడం, రికార్డు స్థాయిలో ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్ డొనాల్డ్స్ తెలిపింది. నెల వ్యవధిలో టమాటా ధరలు 300-400 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సగటున కిలో టమాటా ధర రూ. 100ని మించింది. రిటైల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు టమాటా వినియోగాన్ని దాదాపుగా తగ్గించుకుంది. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ఏకంగా కిలో టమాటాల ధర రూ. 250కి చేరి రికార్డు సృష్టించింది.
‘‘మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మా కఠిణమైన నాణ్యత తనిఖీలను ఆమోదించే టమాటాలను మేము తగినంతగా పొందలేకపోతున్నాం’’ అని న్యూఢిల్లీలోని రెండు మెక్‌డొనాల్డ్స్ స్టోర్లలో నోటీసులు అంటించారు. నోయిడాలోని మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లు ఇలాంటి నోటీసులు కనిపించాయి. టమాటాలు లేకుండా తమ ఉత్పత్తులను అందించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే సౌత్ ఇండియా, పశ్చిమ ప్రాంతాల్లో ఈ సమస్య లేదని చెప్పింది. వేడిగాలులు ఆ తర్వాత రుతుపవనాల ఆలస్యం టమాటా ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగించింది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..