Site icon NTV Telugu

Mayawati: ‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమా నిలిపేయండి.. కేంద్రానికి మాయావతి విజ్ఞప్తి

Mayawati

Mayawati

‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమా ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా టైటిల్ కులతత్వానికి సంబంధించిందిగా.. అవమానకరమైందిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ పెరుగుతోంది.

ఇక ఈ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో నిలిపివేయాలని కేంద్రాన్ని మాయావతి కోరారు. సినిమాలో ‘పండిట్’ అనే పదాన్ని ప్రతికూలంగా ఉపయోగించడం వల్ల బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహావేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చిత్రం ద్వారా బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారని తెలిపారు. సమాజాంలోని పెద్ద వర్గం మనోభావాలను దెబ్బతీస్తున్నందున.. అటు వంటి సినిమాను నిలిపివేయాలని కేంద్రాన్ని మాయావతి కోరారు.

ఈ సినిమా ట్రైలర్‌లో మనోజ్ బాజ్‌పేయ్ అవినీతిపరుడైన పోలీస్ అధికారి అజయ్ దీక్షిత్ పాత్రలో కనిపించారు. దీంతో ఈ సినిమా వివాదం మొదలైంది. లంచం తీసుకునే అలవాట్లు ఉండడంతో అతన్ని ‘‘పండిట్’’ అనే పిలిచేలా సంభాషణ ఉంది. దీంతో ఒక వర్గం వాళ్లను అవమానించినట్లుగా ఉండడంతో వివాదం మొదలైంది.

Exit mobile version