Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maulana Mahmood Madanis Explosive Remarks In Bhopal Trigger Political Storm

Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్‌”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Published Date :November 29, 2025 , 4:41 pm
By Venu Goapl Reddy
  • జమియత్ చీఫ్ మౌలానా మసూద్ మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు..
  • అణిచివేత ఉంటే జిహాద్ ఉంటుంది..
  • మసీదులపై కేసులు వేసి ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది..
Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్‌”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు తీర్పు తర్వాత, ట్రిపుల్ తలాక్, ఇప్పుడు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా కోర్టుల్లో సవాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. మసీదులు, దర్గాలనను సర్వే చేసి, హక్కులు పొందుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో మైనారిటీలకు ఇచ్చే హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని మదానీ అన్నారు.

Read Also: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

మదానీ 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947న ఉన్న మతపరమైన కట్టడం లక్షణాన్ని మార్చవద్దని, దాని స్థితిలో మార్పు చేయలేము అని చెబుతుంది. మదానీ మాట్లాడుతూ.. ఈ చట్టం బాబ్రీ మసీదు మినహా అన్ని మతపరమైన ప్రదేశాలను రక్షిస్తుందని, కానీ నేడు జ్ఞాన్‌వాపి, మధురలోని షాహి ఈద్గా, అజ్మీర్ షరీఫ్ దర్గా, సంభాల్‌లోని జామా మసీదు వంటి ప్రదేశాలలో సర్వేలు నిర్వహిస్తున్నారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు విడాకుల తర్వాత జైలుకు వెళ్లరు, కానీ ముస్లింలు మాత్రమే జైలుకు వెళ్తారని అన్నారు.

అంతేకాకుండా, అణచివేత ఉన్నంత వరకు జిహాద్ ఉంటుందని ఆయన అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, స్పిట్ జిహాద్ వంటి పదాలు ద్వారా ముస్లింలను అవమానిస్తున్నారని, ఇస్లాం శత్రువులు జిహాద్‌ను హింసకు పర్యాయపదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇస్లాంలో, జిహాద్ ముస్లింలకు పవిత్ర విధి అని చెప్పారు. అయితే, మదానీ వ్యాఖ్యలపై బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు పురావస్తు ఆధారాల ఆధారంగా బాబ్రీ మసీదు తీర్పు ఇచ్చిందని, జ్ఞానవాపి, ఇతర కేసులలో, కోర్టు సర్వేకు మాత్రమే అనుమతించిందని, నిర్ణయం తీసుకోలేదని, మదానీ కోర్టుల్ని విశ్వసించాలని, రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • babri masjid
  • bjp
  • Gyanvapi
  • Jamiat Ulema-e-Hind
  • Maulana Mahmood Madani

తాజావార్తలు

  • Tollywood : టాలీవుడ్‌లో సంప్రదాయనీ.. బాలీవుడ్‌‌లో సుద్దపూసనీ రోల్స్ చేస్తున్న క్యూట్ బ్యూటీ

  • TCS Nashik Case: టీసీఎస్‌లో “కార్పోరేట్ లవ్ జిహాద్”.. ఆ దేశం నుంచే ఆపరేషన్.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!

  • Rajasekhar:కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ ఓపెన్ కామెంట్స్!

  • AP Government: అమరావతిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ‘Thi’ కాదు.. ‘Ti’ ఉండాల్సిందే..

  • Kollywood : కార్తీక్ సుబ్బరాజ్‌ను లైట్ తీసుకుంటోన్న కోలీవుడ్ స్టార్స్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions