NTV Telugu Site icon

Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..

Centre To Supreme

Centre To Supreme

Centre To Supreme: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిని రాజకీయ నాయకులపై జీవిత కాలం నిషేధం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న 6 ఏళ్లు సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని, దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన నిర్ణయాన్ని పేర్కొంది. ప్రజాప్రతినిధుల అనర్హత వ్యవధిని నిర్ణయించడం పూర్తిగా ‘‘పార్లమెంట్’’ పరిధిలోనిదని కేంద్రం పేర్కొంది.

‘‘జీవిత కాలం నిషేధం సముచితామా..? కాదా..? అనేది పార్లమెంట్ పరిధిలోని ప్రశ్న’’ అని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. అనర్హత పదాన్ని దమాషా మరియు సహేతుక సూత్రాలను పరిగణలోకి తీసుకుని చట్టసభలు నిర్ణయిస్తాయని చెప్పింది. . 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 మరియు 9 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా తన నిర్ణయాన్ని కేంద్రం ఈ రోజు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

Read Also: AP Crime: భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి

సెక్షన్ 08 ప్రకారం, నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వ్యక్తి జైలు శిక్ష పూర్తయిన తర్వాత 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ఎదుర్కుంటారు. అయితే, ఈ నిషేధాన్ని జీవితకాలానికి పొడగించాలని పిటిషన్ వాదించారు. సెక్షన్ 9 ప్రకారం, అవినీతి లేదా రాజ్యం పట్ల అవిశ్వాసం కారణంగా తొలగించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తొలగింపు తేదీ నుండి ఐదు సంవత్సరాల పాటు అనర్హులుగా ప్రకటించబడతారు. రెండు సందర్భాలలోనూ అనర్హత జీవితాంతం ఉండాలని ఉపాధ్యాయ అన్నారు.

రాజ్యాంగం అనర్హతలను నియంత్రించే మరిన్ని చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్‌కి అవకాశం కల్పించిందని, అనర్హత కారణాలు, అనర్హత వ్యవధిని నిర్ణయించే అధికారం పార్లమెంట్‌కి ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191ని కేంద్ర ఉదహరించింది. ఇది లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభలు లేదా శాసనమండలి సభ్యత్వానికి అనర్హతలను పరిష్కరిస్తుంది.

కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను మూడు నెలల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండానే సభ నుండి వెంటనే అనర్హులుగా ప్రకటిస్తామని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్‌లో తీర్పు ఇచ్చింది, అప్పటి వరకు అలాగే కొనసాగింది. అయితే, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిని నిరోధించడానికి ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. అయితే, ఆ సమయంలో రాహుల్ గాంధీ ఈ ఆర్డినెన్స్‌ని బహిరంగంగా చించేశారు.