Site icon NTV Telugu

Massive Road Accident : రెండు బస్సులు ఢీ.. 8మంది మృతి..

Bus Accident

Bus Accident

Massive Bus Accident at Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్‌ ప్రెస్వేపై బీహార్ నుండి ఢిల్లీ వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8మంది మృత్యువాత పడ్డారు. అయితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి మరో డబుల్ డెక్కర్ బస్సును ఢీ కొట్టిందని చెబుతున్నారు స్థానికులు.

 

ఈ ప్రమాదంలో బస్సు దగ్ధం కాగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని లక్నో ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్వేపై దెబ్బతిన్న బస్సును క్రేన్ సహాయంతో తొలగించారు పోలీసులు. దీని కారణంగా ఎక్స్ ప్రెస్వేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

 

Exit mobile version