NTV Telugu Site icon

Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకి భారీ దెబ్బ.. ఔరంగాబాద్ టికెట్ వాపస్ ఇచ్చిన అభ్యర్థి..

New Project (21)

New Project (21)

Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్‌లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు.

Read Also: Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!

తన్వానీ విలేకరులతో మాట్లాడుతూ.. గత 7 రోజులుగా తన నియోజకవర్గంలో ఉన్నానని, అక్కడి పరిస్థితిని చూస్తున్నానని చెప్పారు. దాని ఆధారంగానే తాను పోటీ చేయనని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలుకు గడువు ముగియడానికి ఒక రోజు ముందు ఈ చర్య తీసుకున్నాడు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ)లో గందరగోళం నెలకొంది, నామినేషన్ ప్రక్రియ ముగియడానికి 24 గంటల ముందు అభ్యర్థులు టిక్కెట్లు తిరిగి ఇస్తున్నారని, పోటీకి నిరాకరిస్తున్నారని అన్నారు. ఉద్ధవ్ సేన సంభాజీ నగర్ (ఔరంగాబాద్ సెంట్రల్) అభ్యర్థి కిషన్‌చంద్ తన్వానీ తన టిక్కెట్‌ను తిరిగి ఇచ్చారని అన్నారు.

తన్వానీ ఏక్‌నాథ్ షిండే శివసేనకు మద్దతు ఇస్తున్నాడని, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సచిన్ సావంత్ అంధేరీ వెస్ట్ నుంచి టిక్కెట్ నిరాకరించాడని, బాంద్రా ఈస్ట్‌ని డిమాండ్ చేస్తున్నాడని, ఎంవీఏ పేలుతోందని, శరద్ పవార్ వర్గంలో విభేదాలు ఉన్నాయని అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడుతాయి.