NTV Telugu Site icon

Inter Caste Marriage: కులాంతర వివాహం జరిపించారని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై దాడి..

Thamilnadau

Thamilnadau

కులాంతర వివాహం జరిపించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్ట్ (CPIM) కార్యాలయంలో చోటు చేసుకుంది. జూన్ 13వ తేదీన వివాహం చేసుకున్న వివిధ కులాలకు చెందిన యువ జంటకు మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. పార్టీ కార్యాలయంతో పాటు, ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Damodar Raja Narasimha: ఫుడ్ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి: మంత్రి దామోదర్

కులాంతర వివాహం చేయడానికి పార్టీ సహాయం చేసినందున, తిరునెల్వేలిలోని పార్టీ కార్యాలయాన్ని కొంతమంది అగ్రవర్ణాల వ్యక్తులు శుక్రవారం ధ్వంసం చేశారని సీపీఐ(ఎం) తమిళనాడు విభాగం ఆరోపించింది. పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మదన్ కుమార్ (28), ఉదయ దాక్షాయిణి (23) అనే నూతన వధువరులు.. జూన్ 13న సీపీఐ(ఎం), అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ సహాయంతో ఇంటి నుండి పారిపోయి వచ్చి వివాహం చేసుకున్నారు. అమ్మాయి దాక్షాయిణి అగ్రవర్ణానికి చెందినది కాగా.. మదన్ ఎస్సీ వర్గానికి చెందినవాడు. శుక్రవారం తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు దంపతులు రిజిస్ట్రార్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అయితే దాక్షాయిణి కుటుంబ సభ్యులు వివాహాన్ని నమోదు చేయకుండా ఆపడానికి ప్రయత్నించారు. దీంతో.. దంపతులు స్థానిక సీపీఐ(ఎం) యూనిట్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో.. 25 మందికి పైగా దాక్షాయిణి కుటుంబ సభ్యులు జిల్లా కమిటీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌తో సహా పలు వస్తువులను ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఇద్దరు పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.

Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు

తిరునెల్వేలికి చెందిన సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో సమస్యను పరిష్కరించడానికి సీపీఐ(ఎం) స్థానిక యూనిట్ ప్రయత్నించిందని తెలిపారు. అయినప్పటికీ దాక్షాయిణి కుటుంబ సభ్యులు పార్టీ కార్యాలయానికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాక్షాయిణి తల్లిదండ్రులతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరికొంత మంది నిందితుల కోసం వెతుకుతున్నామని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. కులాంతర దంపతులకు రక్షణ కల్పించాలని పార్టీ కోరింది.