దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ పాపారావుతో పాటు మరో మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే-47 తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్ పాపారావు మరణించాడని పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుతం బీజాపూర్ జాతీయ ఉద్యానవనం అడవుల్లో భద్రతా దళాలు-మావోల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని.. మావోల సమాచారం తెలియగానే DRG సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లుగా జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?
మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. గతేడాది అనేక మంది మావోయిస్టులను మట్టుబెట్టగా.. ఇంకొందరు లొంగిపోయారు. ప్రస్తుతం ఇంకా లొంగిపోని మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
