NTV Telugu Site icon

కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!

Maoist

క‌రోనా బారిన‌ప‌డి కొంత‌మంది మావోయిస్టులు మృతిచెందిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక‌, క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌బ‌ల‌డానికి దేశ పాల‌కులే కార‌ణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్ర‌ధినిధి అభ‌య్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఇదంతా ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాసులే చేస్తున్నార‌ని.. కల్పిత క‌థ‌ల‌ను ప్ర‌జ‌లు తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు.. కరోనా దేశంలో విజృంభిస్తున్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎనిమిది విడతల్లో ఎలక్షన్ చేయడం, అనేది దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడ‌డ‌మేన‌న్న మావోయిస్టు పార్టీ.. కరోన వ్యాక్సిన్ అమ్మ‌కాల్లో పాలకులు కార్పొరేట్ సంస్థలకు లాభాలు పండించార‌ని.. ఇక వ్యాక్సిన్ దౌత్యం గురించి వెలువడుతున్న కారణాలు వింటూనే ఉన్నామ‌ని మండిప‌డ్డారు.

మా పార్టీపై కొందరు దుష్ప్రచారం చేయడం ఈనాడు కొత్త కాదు. గతంలో మా పార్టీ రోగల పాలై.. మంచం ప‌ట్టింద‌ని అనేక కల్పిత కథ‌నాలు ప్రచారం చేశారు.. ఇక‌, మా పార్టీ నాయకత్వ లొంగుబాటుకు సిద్ధమైందంటూ సంచలనాత్మక వార్తలను విడుదల చేసారు.. ఇలాంటి అన్ని అస‌త్య‌ప్ర‌చారాలు చాల‌క ఇప్పుడు క‌రోనా సోకిందంటూ క‌ట్టుక‌థ‌లు అల్లుతున్నార‌ని ఫైర్ అయ్యారు అభ‌య్.. విప్లవ రాజకీయం నుండి హీనతికంగా దిగజారిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై మాట్లాడడానికి కనీస రాజకీయ అర్హత కూడా లేదని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు మావోయిస్టులు.. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్నచీటికి మాటికి పోలీసుల కథనాలకు వత్తాసు పలుకుతూ మీడియా ముందు ప్ర‌త్య‌క్షం కావడం ఆయనకు మంచిదికదాని హెచ్చ‌రించారు. క‌రోనా సాకుతో మావోయిస్టుల లొంగుబాటుకు ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ పోలీసులు.. అనారోగ్యంతో ఉన్న మా ప్రియమైన కామేడ్స్ గంగాలు, శోబ్రాయిలను ఇటీవలే అరెస్టు చేసి వారికి క‌రోనా పాజిటివ్ తేలింద‌ని అబద్దాలను ప్రచారం చేసి.. వారిని నాటకీయంగా ఆస్ప‌త్రిలో చేర్చిన‌ట్టు చూపి.. నిర్దాక్షిణ్యంగా హత్య చేశార‌ని మండిప‌డ్డారు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి అభ‌య్.