NTV Telugu Site icon

PM Modi: ‘‘చంద్రయాన్-2’’ విఫలమైన రోజు రాత్రి నిద్ర పోలేదు.. వెళ్లొద్దని చాలా మంది చెప్పారు..

Pm Mod 2

Pm Mod 2

PM Modi: భారతీయ అంతరిక్ష విజయాల్లో ‘‘చంద్రయాన్’’ ప్రయోగానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్ల క్రితం చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు ‘‘చంద్రయాన్-2’’ ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది.

‘‘చంద్రయాన్-2’’ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. అయితే, విఫలమైన తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాననే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తన తొలి పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కి ప్రధాని మోడీ హాజరయ్యారు.

Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..

చంద్రయాన్-2 ప్రయోగానికి హాజరుకావద్దని తనను చాలా మంది వారించారని చెప్పారు. ‘‘చాలా మంది నాకు చెప్పారు, సార్ మీరు అక్కడికి వెళ్లకూడదని. అలాంటి మిషన్ల చుట్టూ చాలా అనిశ్చితులు ఉంటాయి. చాలా దేశాలు తరచుగా 4-5 ప్రయత్నాల తర్వాత విజయం సాధిస్తాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది’’ అని చాలా మంది తనకు సలహా ఇచ్చారని మోడీ చెప్పారు. దీనిపై ‘‘తనకు ఎలాంటి బాధ్యత లేదా..?’’ అని అడిగానని ప్రధాని అన్నారు.

చంద్రయాన్-2 చివరి క్షణాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ విలఫమైంది. ‘‘ తనకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం రావడం లేదు. అయితే, ఏదో తప్పు జరిగిందని గ్రహించాను. అది పనిచేయడం లేదు’’ అని ప్రధాని అన్నారు. ‘‘చివరకు ఒక సీనియర్ సైంటిస్టు తన వద్దకు వచ్చారని, అతడితో చింతించకండి’’ అని చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఆ రాత్రి తాను నిద్రపోలేకపోయానని, తర్వాత రోజుఉదయం 7 గంటలకు శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.

‘‘ఇది దేశానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ. కానీ నేను ఎదురుదెబ్బలకు ఏడ్చే వ్యక్తిని కాదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి చెప్పాను. ఏదైనా వైఫల్యం ఉంటే, నేను బాధ్యత తీసుకుంటానని అన్నాను. మీరు ఒక ప్రయత్నం చేశారు, నిరాశ చెందొద్దని చెప్పారు. ఆ తర్వాత చంద్రయాన్ -3 విజయవంతం కావడం మనకు తెలిసిందే’’ అని ప్రధాని అన్నారు.

Show comments