Site icon NTV Telugu

బీజేపీ షాక్‌.. పార్టీకి మాజీ సీఎం కుమారుడు గుడ్‌బై

అసెంబ్లీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో గోవాలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది.. గోవా ప్ర‌జ‌ల గుండెల్లో మంచి సీఎంగా పేరు పొందిన మ‌నోహ‌ర్ పారిక‌ర్‌.. కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించినా.. తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి వ‌చ్చింది.. అది ఆయ‌న‌పై రాష్ట్ర ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కం.. అయ‌తే, తాను ఆశించిన అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ సీఎం మనోహర్‌ పారికర్ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌.. బీజేపీకి గుడ్‌ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ రాజీనామా చేశారు.. ఇక‌, రానున్న ఎన్నిక‌ల్లో పనాజీ అసెంబ్లీ స్థానం నుంచే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. అయితే, పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్‌ పారికర్‌కు బీజేపీ షాకిస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే ఆ సీటు తిరిగి కేటాయించింది.. దీంతో తిరుగుబాటు జండా ఎగ‌ర‌వేసిన ఉత్పల్.. బీజేపీకి రాజీనామా చేసిషాకిచ్చారు.

Exit mobile version