NTV Telugu Site icon

Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు

Manish Sisodia

Manish Sisodia

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది. మార్చి 20తో సిసోడియా కస్టడీ ముగుస్తుండటంతో విచారణకు మరింత సమయం కావాలని ఈడీ కోరిన నేపథ్యంలో కస్టడీని పొడగించింది. ఈడీ తనను ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి గంట వరకు విచారించిందని, ఇకపై తనను జైలులో ఉంచాల్సిన అవసరం లేదని మనీష్ సిసోడియా కోర్టులో వాదించారు. రోజూ ఈడీ తనను అవే ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టుకు సిసోడియా వెల్లడించారు.

ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంపై ఇటీవల సీబీఐ మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. గత నెల ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఏడు నెలల పాలు కేసును విచారించిన తర్వాత, కస్టడీకి కోరారని, దర్యాప్తు సంస్థలు దీని వల్ల ఏం సంపాదించిందో చూపించాలని సిసోడియా తరుపున న్యాయవాది కోరారు.

Read Also: Labourer Wins Lottery: రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగు

తనకు కస్టడీని పొడగించడాన్ని సిసోడియా వ్యతిరేకించారు. ఈడీ, సీబీఐ పని చేస్తోందని ఆరోపించారు. ఈడీ కేవలం నేరం ద్వారా వచ్చిన ఆదాయాలపై మాత్రమే దర్యాప్తు చేయగలదని, నేరంపై కాదని సిసోడియా కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ఆయన సెల్ ఫోన్ ను పలుమార్లు మార్చాడని ఈడీ ఆరోపించింది. ఈడీ ఎప్పుడూ మొబైల్ ఫోన్ల ధ్వంసం చేశారనే అంశాన్ని లేవనెత్తుతోందని, సీబీఐ, ఈడీలు దీన్ని రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయంటూ సిసోడియా లాయర్ కోర్టులో ప్రశ్నించారు. సిసోడియాను ఎట్టి పరిస్థితుల్లో జైలులోనే ఉంచాలని వారు కోరకుంటున్నారని ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ కావాలనే ఆప్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన సిసోడియాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ తో సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

Show comments