Site icon NTV Telugu

Maneka Gandhi: వీధి కుక్కలను షెల్టర్లకు పంపడమేంటి? సుప్రీంకోర్టు తీర్పును తప్పపట్టిన మేనకాగాంధీ

Maneka Gandhi

Maneka Gandhi

దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Supreme Courts: కుక్కలను షెల్టర్లకు పంపండి.. ఢిల్లీ అధికారులకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశం

అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు భారీ స్థాయిలో ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర సోమవారం ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రశ్నించారు. జంతు హక్కుల కార్యకర్తలు, రక్షకులు, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ తీర్పు ఆచరణీయం కాదని.. అశాస్త్రీయమైనది.. చట్టవిరుద్ధంగా అంటూ ధ్వజమెత్తారు. తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే ఈ నిరసన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: US: ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు

ఇక కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోపంతో ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. తీర్పు చాలా వింతగా ఉందన్నారు. అయినా షెల్టర్లకు పంపించడానికి ఢిల్లీలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఒకవేళ షెల్టర్లలోకే పంపాలంటే.. కొత్తగా నిర్మించడానికే రూ.15,000 కోట్లు ఖర్చు అవుతుందని.. అవి నిర్మించాలంటే ఎవరూ నివసించని 3,000 ప్రదేశాలను ఎంచుకోవాలన్నారు. ఒకవేళ ఢిల్లీలో ఏరివేసినా.. పొరుగు రాష్ట్రాల నుంచి స్టెరిలైజ్ చేయని కుక్కలు వస్తాయని ఆమె తెలిపారు. ఈ తీర్పు కేవలం కోపంలో ఉన్న వ్యక్తి ఇచ్చినట్లుగా ఉందన్నారు.

 

Exit mobile version