దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.