క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
25 ఏళ్ల రజత్ కుమార్.. మను కశ్యప్ (21) అనే యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ప్రియురాలితో కలిసి రజత్ కుమార్ ఫిబ్రవరి 9న విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా.. రజత్ కుమార్ చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
2022లో క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడి రజత్ కుమార్ గుర్తింపులోకి వచ్చాడు. రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారుకి మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో వెళ్తున్న రజత్ కుమార్, అతని స్నేహితుడు నిషు కుమార్‌తో కలిసి రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనతో రజత్ కుమార్ మీడియాలో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వారిద్దరికీ రిషబ్ పంత్ రెండు స్కూటర్లు కూడా కొని ఇచ్చాడు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాదిలోనే రికవరీ అయిపోయాడు. తాజాగా రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు సీరియస్‌గా ఉండడం విశేషం.